Sunday, March 15, 2026

జిల్లా పార్టీ అధ్యక్షులు భూమనను కలసిన చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి

  • జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షునిగా అవకాశం ఇవ్వడంపై కృతజ్ఞతలు

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల): మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని వైసీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులుగా నియమితులైన చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ముందుగా భూమనకు శాలువ కప్పి పుష్పగుచ్చంతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ భూమన కరుణాకర్ రెడ్డి నాయకత్వంలో జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులుగా పనిచేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికై నిరంతర పోరాటం చేస్తానని, తనపై ఎంతో నమ్మకంతో జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులుగా అవకాశం కల్పించిన పెద్దలు అందరికీ కృతజ్ఞతగా వుంటానన్నారు. అనంతరం తన వెంట వచ్చిన పార్టీ నేతలను భూమనకు పరిచయం చేశారు. అనంతరం జిల్లా రైతు విభాగం అధ్యక్షులు గా నియమితులైన మల్లం చంద్రమౌళిరెడ్డి, జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు చిన్ని యాదవ్ లతో పార్టీ బలోపేతానికి చేపట్ట వలసిన కార్యక్రమాలపై భూమన చర్చించారు. అనంతరం భూమన అభినయ్ రెడ్డిని కూడా కలసి పుష్ప గుచ్ఛం అందించి శాలువాలతో సత్కరించారు. భూమనను కలసిన వారిలో తిరుపతి రూరల్ మండల వైస్ ఎంపీపీ విడుదల మాదవరెడ్డి,మునీశ్వర రెడ్డి, ఓబుల్ రెడ్డి, ఎంపిటిసి హరిక్రిష్ణారెడ్డి, చిలమంద హరిక్రిష్ణ, కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి, సాయి రాయల్, శశిధర్ రెడ్డి, ప్రసాద్, నవీన్ రెడ్డి, హరి ప్రసాద్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఓంప్రకాష్, ముబారక్ లు వున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News