Monday, March 16, 2026

భారీగా గంజాయి పట్టివేత

నేటి సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం (జక్కుల సందీప్) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం చెక్పోస్ట్ నందు హైదరాబాద్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వారు భద్రాచలం చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించుచుండగా హుండాయ్ గ్రాండ్ ఐటెం ఆస్తా కారు రాగా అట్టి కారును తనిఖీ చేయగా అందులో 81.950 కిలోగ్రాముల ఎండు గంజాయి లభ్యమైనది. అట్టి గంజాయిని తరలిస్తున్నటువంటి కారులో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులను అదుపులోనికి తీసుకొని విచారించగా అట్టి వ్యక్తుల పేర్లు నంద, సన్నాఫ్. హిర్మా,41సంవత్సరాలు,కోయ, కూలి, మర్లగూడ గ్రామం, కుంట తాలూకా సుక్మా జిల్లా చతిస్గడ్, పండగ వెంకటేశ్వర్లు, సన్నాఫ్ నరసయ్య, 43 సంవత్సరాలు ప్రెస్ రిపోర్టర్ సోంపల్లి బూర్గంపాడు మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.పండగ రాములు, సన్నాఫ్ నరసయ్య, 46సంవత్సరాలు, మాల, ప్రెస్ రిపోర్టర్, సోంపల్లి (విలేజ్), బూర్గంపాడు మండలం,భద్రాద్రి కొత్తగూడెంజిల్లా, వాహనం నంబర్ AP37 BU 5216. హుండాయ్ గ్రాండ్ ఐ10 ఆస్తా.గంజాయి 81.950 కిలోలదాని విలువ సుమారు 20,25,000 ఉంటుందని తెలియజేశారు. తదుపరి విచారణ నిమిత్తం ముగ్గురు వ్యక్తులను గంజాయిని మరియు కారును భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించినారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News