Monday, March 16, 2026

మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు

నేటి సాక్షి, హుజూరాబాద్ ఆర్.సి (రాఘవుల శ్రీనివాసు): మాహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా హుజురాబాద్ హై స్కూల్ గ్రౌండ్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. బీసీ ఆజాది ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు చిలుకమారి శ్రీనివాస్, హుజురాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు పంజాల తిరుపతి గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఇప్పకాయల సాగర్ పూలమాలవేసి నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ తన జీవితాన్ని త్యాగం చేసి భారతదేశానికి స్వతంత్రం తీసుకువచ్చారు. ఆ మహానుభావునికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. శాంతి అహింస సత్యాగ్రహం అనే ఆయుధాలతో స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించిన భారత జాతి పితామహుడు ఆహింసమూర్తి మహాత్మా గాంధీ సేవలు తరతరాలకు ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కట్ల రవీందర్, ఒడిజే చందర్రావు, కందుకూరి భాస్కర్, ఇల్లందుల తిరుపతి, చిదురాల శ్రావణ్, కోలే సాయికుమార్, వేముల రాజు, తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News