- ప్రశ్నించే గొంతును నొక్కేయాలని చూస్తున్న కూటమి ప్రభుత్వం
- రాజకీయ కక్ష తోనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి పై కుట్ర
- గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి కృపా లక్ష్మి
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నిస్తే కేసులా అని గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కృపా లక్ష్మీ మండిపడ్డారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్ర, దుశ్చర్యలపై కృపా లక్ష్మీ మండిపడ్డారు. పేద ప్రజల కోసం నిరంతరం పోరాడే వైయస్ జగన్ అన్న చుట్టూ ఉన్న బలమైన నాయకులను అన్ని రకాలుగా దెబ్బతీయడంతో వైఎస్ఆర్సిపి ని నిర్వీర్యం చెయ్యొచ్చు అనే భ్రమలోనే కూటమి ప్రభుత్వం నేతలు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం నిరంతరం ఎన్ని పోరాటాలు చేయడానికి అయినా సిద్ధమని ఇలాంటి బెదిరింపు కేసులకు రాజకీయ కుట్రలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై గత వారం పది రోజులుగా చేస్తున్న అసత్య ప్రచారాలను , పచ్చ మీడియా చేస్తున్న దుర్మార్గపు రాతలను తీవ్రంగా ఖండించారు.





