నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : కరీంనగర్ లో అపూర్వ డిగ్రీ కాలేజ్ అధ్యాపకులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మీలో ఒకడిని గెలిపించుకోవాలని మీ సమస్యలే నా సమస్యలుగా భావించే నాకు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మన సమస్యల కోసం పెద్దల సభలో మాట్లాడే అవకాశాన్ని మీరందరూ కల్పించాలని మీరందరూ ఒక్కొక్కరు ఇంకొకరికి చెప్పాలని మనలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిల్చుంటున్నాడని మనందరం కూడా పోకల నాగయ్య ప్రైవేట్ అధ్యాపకుని గెలిపించుకుంటే నిరంతరం మనకోసం పోరాడుతాడని భావించి గెలిపించాలని కోరుకుంటూ ఎమ్మెల్సీ బరిలో నేను గెలిచిన మరుక్షణం ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకుల సంక్షేమ నిధి కోసం నా మొదటి ఎమ్మెల్సీ మీ భవిష్యత్తు నిధి లో జమ చేసి మీ సంక్షేమ కోసమే ఉపయోగిస్తానని మొదట మీకు ప్రమాణం చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో టిఎల్ఎఫ్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి,సత్యనారాయణ రాజు, టిఎల్ఎఫ్ కరీంనగర్అధ్యక్షులు సదానంద చారి, ప్రధాన కార్యదర్శి రాజు, కళాశాల ప్రిన్సిపాల్ మనోహర్, శ్రీనివాస్, సంతోష్, కేద్రీనాథ్ ,రమేష్ ,శైలజ, స్వప్న, రాధిక, ఉపాధ్యాయులు ఆధ్యాపకులు పాల్గొన్నారు.





