నేటి సాక్షి, రామడుగు (పురాణం సంపత్) : రామడుగు మండలంలోని గోపాల్ రావు పేట గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి రాత్రికి రాత్రే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నిర్మాణం చేపట్టగా గ్రామం నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై స్పందించిన గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ బుధవారం పోలీసు బందోబస్తు నడుమ అక్రమ కట్టడాన్ని కూల్చివేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వ స్థలం ఆక్రమించి నిర్మాణం చేపట్టినందుకుగాను కట్టడాన్ని కూల్చివేసామని తెలిపారు.





