- వేములవాడ సిఐ కి ఫిర్యాదు చేసిన విశ్వహిందూ పరిషత్ నాయకులు
నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ (కోక్కుల వంశీ) : వేములవాడ అర్బన్ మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అగ్రహారం శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ముందు గుర్తుతెలియని ఓ మతానికి చెందిన వ్యక్తి గుడి ముందు నమాజ్ చేసి పాదరక్షలతో ఆలయాన్ని అపవిత్రం చేసి అక్కడ ఉన్న అర్చకులపై సిబ్బందిపై హత్యాయత్నం చేసిన సదరు అన్యమతానికి చెందిన వ్యక్తిపై హత్యాయత్నం కేసు కింద నమోదు చెయ్యాలని హిందూ పరిషత్ నాయకులు వేములవాడ పట్టణ సిఐ వీర ప్రసాద్ కు పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ… గత కొద్ది రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో పలు గ్రామాలలో హిందూ ఆలయాలలో హుండీ దొంగతనాలు, అన్యమత ప్రచారాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. ఆలయాలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలయాలపై అపవిత్రం చేసిన వారిని, ఆలయాలపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేశారు. ఆలయంలో పనిచేసే అర్చకులకు, సిబ్బందికి రక్షణ కల్పించాలని అన్నారు. హిందువుల మనోభావాలను కాపాడాలని పట్టణ సీఐ వీర ప్రసాద్ కి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గడప కిషోర్ రావు, నాగుల రాములు, గౌరిశెట్టి శ్రీనివాస్, కొక్కు గోపాలకృష్ణ, సంతోష్, వికాస్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





