- బిఆర్ఎస్ శ్రేణులు వినూత్న నిరసన
నేటిసాక్షి, రాయికల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోని వచ్చి 420 రోజులు అవుతుందని ఇచ్చిన హామిలను నెరవేర్చలేదని రాయికల్లో బిఆర్ఎస్ శ్రేణులు గురువారం వినూత్న నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది వచ్చేలా చూడాలని గాంధీని కోరుతూ వినతిపత్రం అందజేసారు. రాయికల్ మండల, పట్టణ బి.ఆర్.యస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు, ఈ కార్యక్రమంలో రాయికల్ మండల, పట్టణ అధ్యక్షులు బర్కం మల్లేష్, ఎలిగేటి అనిల్ , ఎఎంసి మాజీ ఛైర్మన్ ఎలగందుల ఉదయశ్రీ, మండల ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రావు ,మండల మహిళ విభాగం అధ్యక్షురాలు స్పందన సాగర్ రావు,మాజీ కౌన్సిలర్లు మారం పెల్లి సాయికుమార్, కన్నక మహేందర్ ,మండల సమన్యయ సమితి సభ్యులు సురేందర్ నాయక్, కొల్లూరి వేణు, మాజీ ఎంపిటిసిలు దొంతి నాగరాజు, రాజేందర్ గౌడ్, మండల మైనార్టీ అధ్యక్షులు చాంద్ పాషా, ఎస్సీ విభాగం అధ్యక్షులు నీరటి శ్రీను, మండల బిఆర్ఎస్ నాయకులు లక్ష్మీ , ఆడెపు కృష్ణ , రొట్టే శ్రీనివాస్, డా॥ రఘునాధ్, చంద్రకంటి రవి, కోల కుమార్, శివనీతి గంగారెడ్డి, రాంచంద్రం, వినోద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.





