- ఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎస్ బాలరాజు సుతారి రాములు
నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి): దేశంలోని 14 రాష్ట్రాలలో బీడీ కార్మికులు ఉపాధి పొందుతు, ప్రభుత్వాలకు అనేక రకాల పన్నులు చెల్లిస్తున్న బీడీ పరిశ్రమపై జీఎస్టీ ని రద్దు చేయాలని, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు సుతారి రాములు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర రెండవ మహాసభలు జగిత్యాల జిల్లాలోని కోరుట్ల డివిజన్ నందు పద్మశాలి సంఘ భవన్ లో గురువారం రోజున ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ బీడీ కార్మికుల వేతనాలు తక్కువ చెల్లిస్తున్న రాష్ట్రాలకు ఈ బీడీ పరిశ్రమలు తరలిపోకుండా దేశంలో ఒకే రకమైన వేతనాలు ఇవ్వాలన్నారు. బీడీ పరిశ్రమపై ఒక పైసా బడ్జెట్ కేటాయించని కేంద్ర ప్రభుత్వం ఈ బీడీ పరిశ్రమపై జీఎస్టీ ని పెంచే విధానం వెంటనే విరమించుకోవాలని కోరారు. ఈపీఎఫ్ సంస్థలో బీడీ కార్మికులకు కనీస పెన్షన్ కేవలం 1000 రూపాయల లోపే ఉందని దానిని 5000 రూపాయలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి పెంచాలని, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారాములు, జాతీయ కార్మిక సంఘం నేతలు కలిసి సూచించాయన్నారు. లేనియెడల ఈ బడ్జెట్ సమావేశాలలో చలో ఢిల్లీ పార్లమెంట్ నిర్వహిస్తామని అందుకై కార్మికులు సమాయత్తం చేస్తామని ఈ మహాసభలలో తీర్మానం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా అర్హులైన బీడీ కార్మికులకు ఇండ్లు కట్టించి, ఈఎస్ఐ ఆస్పత్రిని ప్రతి జిల్లాలలో ఏర్పాటు చేయాలన్నారు. బీడీ కార్మికులకు బ్యాంకు ఖాతాలో కూలి డబ్బులు వేయకుండా కంపెనీ ద్వారా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన స్థలమున్న వారు ఇల్లు నిర్మించుకొనుటకు ఎలాంటి ఆంక్షలు లేకుండా 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. చేయూత పథకం కింద కార్మికులకు 2000 రూపాయల నుండి 400 రూపాయలకు పెంచుతానన్న హామీని నెరవేర్చాలని, లేకుంటే స్థానిక సంస్థ ఎన్నికలలో కార్మికులు తగిన రీతిలో ఓటు ద్వారా బుద్ధి చెప్తారు అన్నారు. ఈ మహాసభలలో తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, నిజామాబాద్, హనుమకొండ, సిద్దిపేట, ఆదిలాబాద్, ఉమ్మడి ఐదు జిల్లాల నుండి కార్మిక నేతలు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శులు ఎస్ విలాస్, టీ సమ్మయ్య, బీడీ కార్మిక సంఘం రాష్ట్ర నేతలు ఎండి ముక్రం, బి గోవర్ధన్, కడారి రాములు, ఎండి మౌలానా, చెన్న విశ్వనాథం, మునుగురి హనుమంతు,తోట బిక్షపతి, కొక్కుల శాంత, ఎండి ఉస్మాన్, రాధా, కెవి అనసూయ, కే గోదావరి, ఆదే రంగారెడ్డి, అయ్యవారి లక్ష్మణ్, ఏ భూమేష్, కిరణ్, ఏ వేణు, అందే వంశీకృష్ణ, సాంబార్ మహేష్, సదానందం గౌడ్, బి జ్యోతి, వెన్న మహేష్, ఎండి ఉస్మాన్, తదితరులు పాల్గొన్నారు.





