Monday, March 16, 2026

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ల్లోనే నాణ్యమైన విద్య

  • విద్యార్థుల కోసం అధ్యాపకుల ప్రచారం

నేటిసాక్షి, రాయికల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని, విద్యార్థులంతా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని అధ్యాపకులు ప్రచారం నిర్వహించిన సంఘటన ఇది. జగిత్యాల ఎస్కెఎన్ఆర్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు గురువారం రాయికల్ మండలం ఇటిక్యాల మోడల్ స్కూల్, రాయికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పర్యటించి విద్యార్థులను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని చైతన్యపరిచారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, ప్రభుత్వ విద్య పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ పి రాజు, ఉపన్యాసకులు సాయి మధుకర్, గోవర్ధన్, కందుకూరి శ్రీనివాస్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News