Monday, March 16, 2026

గాంధీ విగ్రహానికి పాలాభిషేకం

  • కమలాపూర్ ఆర్యవైశ్య సంఘ సభ్యులు

నేటి సాక్షి, కమలాపూర్ (నాగరాజు పటేల్ఎడ్ల) : కమలాపూర్ మండల కేంద్రంలోని జాతిపిత మహాత్మా గాంధీ 77 వ వర్ధంతి పురస్కరించుకొని కమలాపూర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సంఘ భవనం వద్ద గల గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం పూలమాల తో అలంకరింపచేసి ఘనంగా నివాళులు అర్పించారు. శాంతి యూత పద్ధతిలో తెల్లవారిపై పోరాడి ఒక రక్తం చుక్క కూడా వృధా కాకుండా భారత దేశానికి స్వాతం స్వాతంత్రం సముపార్జించిన జాతి పిత మహాత్మా గాంధీని నాదురాం గాడ్సే అనే భారతీయ దుండగుడు హత్య చేయడం దురదృష్ట సంఘటనగా పేర్కొంటూ మహాత్మా గాంధీ అమర్ హే అంటూ నినాదాలు చేయడం జరిగింది.గాంధీ వర్ధంతి తో పాటు ఇదే రోజు భారత జాతి వ్యాప్తంగా అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్న దృష్ట్యా వైశ్య సంఘం సభ్యులు అమరవీరుల సేవలను గుర్తు చేసుకుంటూ వారి మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొనిశెట్టి మునిందర్, ప్రధాన కార్యదర్శి వెనిశెట్టి పున్నం చందర్, ఉపాధ్యక్షులు నూక వీరభద్రయ్య, వెనిశెట్టి విజయకుమార్ ముఖ్య నాయకులు భూపతి శివశంకర్, శింగిరికొండ యుగంధర్,భూపతి రఘురాం,మాడిశెట్టి సంపత్, నూక రమేష్, నూక కిరణ్, కన్నూరి శ్రీధరాచారి, వెనిశెట్టి కనకలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News