Monday, March 16, 2026

అడవి పంది వేటగాళ్ల పట్టివేత

నేటి సాక్షి, వేమనపల్లి : చెన్నూరు డివిజన్ నీల్వాయి రేంజ్ పరిధిలోని కొత్తగూడెం సమీపంలో వన్యప్రాణులను వేటాడే ముఠాను గురువారం పట్టుకున్నట్లు అటవీ రేంజ్ అధికారి అప్పలకొండ తెలిపారు. అటవీ రేంజ్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం నీల్వాయి గ్రామానికి చెందిన నార్వేల్లి మల్లయ్య,మంత్రి రాజన్న, గొర్లపల్లి గ్రామానికి చెందిన నికాడి నాగేష్ ముగ్గురు కలిసి నీల్వాయి, కొత్తగూడెం శివారులో నార్వెల్లి మల్లయ్య మక్క చేనులో విద్యుత్ లైన్ ద్వారా విద్యుత్ బిగించి అడవిపందిని చంపడం జరిగిందని తెలియగానే సంఘటన స్థలానికి డిప్యూటీ రేంజ్ అధికారి జే. ప్రమోద్ కుమార్, అటవీ బీట్ అధికారి ఎం. మహిపాల్, బెస్ క్యాంపు సిబ్బంది చేరుకొని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అట్టి విషయంపై పూర్తి విచారణ చేసిన అధికారులు పంది మాంసంతో పాటు ముగ్గురుని అదుపులోకి తీసుకొని నీల్వాయి అటవీ రేంజ్ కార్యాలయానికి తరలించారు. విచారణలో నేరం అంగీకరించడంతో వైల్డ్ లైఫ్ సంరక్షణ చట్టం 1972 ప్రకారం ముగ్గురు పైన కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా అటవీ రేంజ్ అధికారి మాట్లాడుతూ నీల్వాయి రేంజ్ పరిధిలో ఎవరైనా విద్యుత్ ఉచ్చులు బిగించడం వలన వన్యప్రాణులకు, రైతులకు, పశువులకు కూడా ప్రాణనష్టం జరుగుతుందని అన్నారు. అటవీ సంపాదన ధ్వంసం చేసిన వన్నప్రాణులను వేటాడేందుకు ప్రయత్నం చేసిన ఉచ్చులు బిగించి వేటాడిన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో అడవి పంది మాంసాన్ని ఖననం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News