Monday, March 16, 2026

ఓ మహాత్మా మీరు మళ్లీ పుట్టాలి సబితా ఇంద్రారెడ్డి

  • మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మరిచిందని ఆయన విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్): మహేశ్వరం నియోజకవర్గం లోని సరూర్నగర్ డివిజన్ సీనియర్ నాయకులు లోకసాని కొండల్ రెడ్డి, ధర్పల్లి అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించి ఇచ్చిన 420 హామీల వినతి పత్రాన్ని మహాత్మా గాంధీ విగ్రహానికి అందజేసిన మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ రాష్ట్ర మాజీ గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఓమహాత్మా మీరు మళ్ళీ పుట్టాలి ఎందుకు అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు(420) రోజులు గడుస్తున్నా 420 హామీలు ప్రజలకు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చలేదని ముఖ్యంగా అన్ని రంగాలను నిర్వీర్యం చేశారని పరిపాలన పై ఎలాంటి అవగాహన లేకుండా ఇష్టానుసారంగా పరిపాలిస్తున్నారని వారిచ్చిన 420 హామీలు ఇచ్చి మర్చిపోయారని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఓ మహాత్మా మీరైనా ప్రభుత్వానికి సద్ది చెప్పి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ఇచ్చిన హామీ తప్పకుండా నెరవేర్చాలని ఈ ప్రభుత్వానికి మీ ద్వారా విన్నవించుకుంటున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా నాయకురాలు సుశీల రెడ్డి, మైనార్టీ అధ్యక్షులు ఇస్మాయిల్, మురుకుంట్ల అరవింద్, గౌని శ్రీనివాస్ గౌడ్, నాగేష్, సాజిద్, రాజేష్ గౌడ్, కొండా గిరి గౌడ్, సోషల్ మీడియా కన్వీనర్ వుత్తుపల్లి శ్రీనివాస్, రిషి, సాదిక్, జహీర్, పుట్టం విజయ్, ప్రత్యుష్, మధునాగుల మహేందర్ , గోవర్ధన్ రెడ్డి,రాగం సునీల్ యాదవ్, కడారి రాజు యాదవ్, ధర్పల్లి మానస్, సాలమ్మ, రజాక్, సాజిద్, రాజశేఖర్, గుఫ్రాన్, భాగ్య లక్ష్మి, వసంత, సుధ, శృతి, జగదీష్, రమేష్ గౌడ్, కిరణ్, యాదగిరి, ప్రశాంత్, ఏలాద్రి, కిషోర్, మురళి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News