Monday, March 16, 2026

విద్య రంగ సమస్యలను పరిష్కరించాలి ఎస్ఎఫ్ఐ

నేటి సాక్షి, చేర్యాల: భారత విద్యార్థి ఫెడరేషన్ చేర్యాల డివిజన్ కమిటీ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఆముదాల రంజిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు అలాగే ఉన్నాయని వారు తెలియజేశారు. మార్పు తీసుకొస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు ఇంకా కలలాగానే మారిపోయిందని వారు అన్నారు రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కార కోసం పోరాటం చేస్తామని వారు అన్నారు. సంవత్సర కాలం గడిచిన విద్యారంగం విద్యాశాఖ మంత్రి ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం దొరకలేదా సయంగా రాష్ట్ర ప్రభుత్వ విద్యా రంగాన్ని మొత్తం నాశనం చేస్తున్నానని వారు తెలియజేశారు. రాబోయే రోజులలో విద్యారంగ సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తామని విద్యారంగం పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాన్ని ఈ తెలంగాణc రాష్ట్రంలో తీసుకొస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చేర్యాల డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు మైసంపల్లి, రాహుల్, తాడూరి భరత్ కుమార్, డివిజన్ నాయకులు ప్రశాంత్ భరత్, రాకేష్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News