Monday, March 16, 2026

తిరుపతి జిల్లా ఎన్టీఆర్ నగర్ లో నూతన సబ్ స్టేషన్ పనులు పూర్తి

  • చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం
  • విద్యుత్ అధికారులతో కలసి సబ్ స్టేషన్ ఆవరణంలో చెట్లు నాటారు
  • కక్షపూరితమైన రాజకీయాలు లేవు, అందరితో కలసి పనిచేయటమే నాకు తెలుసు
  • అభివృద్ధికి సహకరించండి-కలసి మెలసి పనిచేద్దాం
  • ఎమ్మెల్యే నియోజకవర్గంలో కొత్తగా 6 సబ్ స్టేషన్ ల ఏర్పాటుకు కృషి

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించిన విధంగా “మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం” అనే నినాదంతో అభివృద్ధి వైపు అడుగులు వేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. చంద్రగిరి మండలం, తొండవాడ గ్రామ పంచాయతీ ఎన్టీఆర్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ పి.యం.ఎ.వై యన్.టి.ఆర్. నగర్ లోని ఆంధ్రప్రదేశ్ దక్షిణప్రాంత విద్యుత్ సంస్థ 33/11 కె.వి. విద్యుత్ ఉపకేంద్రము చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా తొండవాడకు చేరుకున్న ఎమ్మెల్యేకు కూటమి నాయకులు, అధికారులు, స్థానికులు శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్చం చేతికి అందించి సాదరంగా ఆహ్వానించారు. సబ్ స్టేషన్ ఆవరణంలో విద్యుత్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే చెట్లు నాటారు. కూటమి నాయకులతో కలిసి పండితులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నూతనంగా ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించిన విధంగా “ఇది మంచి ప్రభుత్వం” అనే నినాదంతో అన్ని పార్టీలను కలుపుకొని అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని అన్నారు. ఎన్నికలలో గెలిచి అత్యధిక మెజారిటీతో గెలిచి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి అయింది అయినప్పటికీ ఎక్కడ కూడా కక్షపూరితమైన రాజకీయాలకు తావు లేకుండా అందరిని కలుపుకుంటూ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ఎక్కడైనా నా కార్యకర్తల వల్ల, నావల్ల కానీ, ఏదైనా తెలిసి తెలియకుండా పొరపాటు జరిగుంటే ఆ సమాచారాన్ని నాకు తెలియపరిస్తే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తానన్నారు. నాకంటూ ప్రత్యేకంగా ఎటువంటి వ్యాపారాలు, ఎటువంటి లాభాపేక్ష లేకుండా అన్ని మండలాలలో ఏదో ఒక ప్రభుత్వ పథకాలతో పాటు ఏదో ఒక కార్యక్రమంతో ప్రజలకు చేరువయ్యేందుకు వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నానని గతంలో ఎన్నడు లేని విధంగా ప్రజలతో మమేకమై పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నానని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచి మా పెద్దాయన చంద్రబాబు, చినబాబు లోకేష్ కి కానుకగా ఇస్తానని అన్నారు. నా ఈ సంకల్పానికి తోడుగా నియోజకవర్గ అభివృద్ధికి చేయుత అందించి పార్టీలకు అతీతంగా పనిచేసేందుకు కలసి రావాలని ఎమ్మెల్యే కోరారు. నూతన సబ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో మండల పార్టీ అధ్యక్షుడు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు, సీనియర్ నాయకులు ఇరంగారి రమేష్ రెడ్డి, మొక్కల కుమార్ రాజా రెడ్డి, గౌస్ భాషా బాలకృష్ణ మూర్తి నాయుడు, తులసీశ్వర్ రెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి, ఆకుల ప్రభాకర్ నాయుడు, ప్రవీణ్ రాయలు జనసేన నాయకులు తపసి మురళి రెడ్డి, అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News