Monday, March 16, 2026

శ్రీ శక్తి పీఠం లో ఘనంగా శ్రీ రాజశ్యామలా నవరాత్రులు ప్రారంభం

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల): రామచంద్రాపురం రాయల చెరువులో వెలసియున్న శ్రీ శక్తి పీఠంలో గురువారం శ్రీ రాజశ్యామలా దేవి నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజున శ్రీ రాజశ్యామలా దేవికి కుర్తాళం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానందభారతీ మహాస్వామి వారి దివ్య సమక్షంలో మంత్ర మహేశ్వరి శ్రీ శక్తి పీఠాధీశ్వరి మాతజీ శ్రీ శ్రీ శ్రీ రమ్యానందభారతీ స్వామినీ వారి ఆధ్వర్యంలో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దేవికి ఘనంగా అభిషేకం నిర్వహించారు. తదుపరి శ్రీ రాజశ్యామలా దేవికి నాగవల్లీ దళముల (తమలపాకుల) విశిష్టాలంకరణ జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ అన్న ప్రసాద వితరణ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News