నేటి సాక్షి, మందమర్రి:– సింగరేణి ఏరియా జిఎం కార్యాలయంలో గురువారం గుర్తింపు కార్మిక సంఘమైనా ఏఐటీయూసీ తో నిర్వహించిన 3వ ఏరియా స్థాయి స్ట్రక్చరల్ సమావేశాల్లో పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ఈ సమావేశంలో ఏరియాలోని కాసీపేట 2 గనిపై ఫ్యాన్ ఆపరేటర్, మ్యాగ్జిన్ రూమ్ నిర్మాణం, మ్యాగ్జిన్ రూమ్ కి కంప్యూటర్, అదే విధంగా కాసీపేట 1గనికి సంబంధించి స్కావెంజర్ పోస్టింగ్, కాసీపేట 1,2 గనులకు సంబంధించిన ఓపెన్ రెస్ట్ హాల్ నిర్మాణం, కేకే ఓసీపీకి సంబంధించి ఫర్నిచర్, లాకర్ సౌకర్యం కల్పించాలని, సోమగూడెం భరత్ కాలనీలో కొత్త డ్రైనేజీ పైప్ లైన్, వాటర్ పైప్ లైన్, సరిపడా వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, రామకృష్ణాపూర్ రైల్వే స్టేషన్ రోడ్ లో గల కమ్యూనిటీ హాల్లో కుకింగ్, డైనింగ్ హాల్ నిర్మాణం చేపట్టాలని కోరారు. అనంతరం ఏరియా జిఎం జి దేవేందర్ మాట్లాడుతూ, గుర్తింపు సంఘ నాయకులు ప్రస్తావించిన పనులను పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు ఏ విధంగా ఉత్పత్తి లక్ష్యసాధన సహకరించారో, అదేవిధంగా ఇక ముందు సైతం సహకరించాలని కోరారు. సింగరేణి అభివృద్ధిలో, ఉత్పత్తి ఉత్పాదకతలో కార్మిక సంఘాల పాత్ర చాలా కీలకమైనదని తెలిపారు. సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి ఉత్పాదకతలోనే కాకుండా ఉద్యోగుల సంక్షేమానికి సైతం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, రామకృష్ణాపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎండి అక్బర్ అలీ, ఏరియా ఎస్ఓటు జిఎం విజయ్ ప్రసాద్, ఏరియా రక్షణ అధికారి ఎం రవీందర్, ఏరియా ఇంజనీర్ ఈ అండ్ ఎం వెంకటరమణ, కేకే ఓసీ ప్రాజెక్ట్ అధికారి మల్లయ్య, కేకే గ్రూప్ ఏజెంట్ రామదాసు, డిజిఎం ఐఈడి రాజన్న, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఈ అండ్ ఎం డివైజిఎం సురేష్, డివైపిఎం మైత్రేయ బంధు, ఈ అండ్ ఎం ఎస్ఈ కృష్ణారెడ్డి, ఏరియా సీనియర్ సెక్యూరిటీ అధికారి రవి, యూనియన్ నాయకులు సుదర్శన్, సివి రమణ లు పాల్గొన్నారు.





