- జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : గత ఐదు సంవత్సరాలుగా పరిపాలించిన మునిసిపల్ పాలకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్ ని, మున్సిపాలిటీ కౌన్సిలర్ లను జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ చేతులమీదుగా సన్మానించారు. అనంతరం సరితమ్మ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలుగా ప్రజలకు జవాబుదారీగా బాధ్యతలు నిర్వర్తించి, సంతృప్తితో కౌన్సిల్ సభ్యులతో కలిసి గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధి చేసిన ఘనత మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు కు దక్కుతుందని సరితమ్మ అన్నారు. మంచిని మంచిగా పేర్కొనడం సన్మానించడం మంచి సంప్రదాయమని మంచిని మంచిగా చెడును చెడుగా స్వీకరించి ఇకపై గద్వాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేయాలని పేర్కొన్నారు. మున్సిపాలిటీలతో పోలిస్తే మనం మున్సిపాలిటీ వివాదరీతంగా కలిసిమెలిసి పాలకవర్గం గడువు ముగిసిందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు టిపిసిసి రాష్ట్ర నాయకులు గంజిపేట్ శంకర్, పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఇసాక్, సీనియర్ నాయకులు మధుసూదన్ బాబు, అమరవాయి కృష్ణారెడ్డి, మాణిక్యమ్మ, శరద, జయ్యమ్మ,వసీమ బేగం, కబీర్ దాసు అనిత, గిరిజ బాయ్,శ్రీమన్నారాయణ, మహేష్, నాగరాజు, అరుణ నాయకి, లక్ష్మీదేవి, లక్ష్మీ కొర్రి సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.





