
నేటి సాక్షి, వీణవంక:
వీణవంక మండలంలోని రైతు వేదిక పూర్తిగా స్వచ్ఛభారతకు వ్యతిరేకంగా మారింది. రైతు వేదిక మద్యం సీసాలతో దర్శనమిస్తుంది. రైతు వేదిక లోపల కల్లు బాటిళ్లు ఉండడం ఇది రైతు వేదికనా లేక కళ్ళు మడవనా అనే లాగా మారిపోయింది. ఒకవైపు ప్రభుత్వాలే స్వచ్ఛభారత్ చేయమని చెప్పుతుంటే కానీ ప్రభుత్వ కార్యాలయాలలు ఐనా రైతు వేదిక డంప్యాడ్ గా మారడం హాస్యాస్పదంగా ఉంది. వెంటనే ఉన్నతాధికారుల స్పందించి రైతు వేదికను పరిశుభ్రంగా ఉంచడం ఎంతైనా అవసరం ఉందని వీణవంక మండల రైతులు పేర్కొన్నారు.






