- జ్యుడీషియల్ విచారణ జరిపించాలి
- సామాజిక కార్యకర్త షేక్ సాబిర్ అలి డిమాండ్

నేటి సాక్షి, జమ్మికుంట :
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో జై భీమ్ సినిమాను మరిపించేలా జమ్మికుంట సిఐ అరాచకాలు ఉన్నాయని, సామాజిక కార్యకర్త షేక్ సాబిర్ అలి, దళిత నాయకులు అంబాల రాజు అన్నారు. శుక్రవారం రోజున జమ్మికుంట పట్టణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ… బాధితులు కాటిపల్లి లక్ష్మి మరియు ఠాగూర్ సుశీల కుటింబీకులకు పట్టణ సీఐ అన్యాయం చేశారు అని, హుజురాబాద్ ఏసిపి పరిధిలో పనిచేస్తున్నటువంటి ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన సామాన్య పౌరులతో పాటు అధికారులు కూడా కుల వివక్షకు గురైతున్నారు అని, ఆధార పూర్వకంగా మీడియా ముందు మాట్లాడడం జరిగింది. ఇట్టి విషయమై డిపార్ట్మెంటల్ ఎంక్వయిరీ కాకుండా జ్యూడిషియల్ ఎంక్వైరీ జరపాలని మీడియా ముఖంగా డిమాండ్ చేసారు. ఈ మీడియా సమావేశంలో బాధితురాలు కాటిపల్లి సంధ్యారాణి మాట్లాడుతూ సిఐ అరాచకాల మూలంగా నేను నా కట్టు బట్టల్లో మూత్రం పూసుకోవాల్సిన దుస్థితి కల్పించారని బహిర్గత పరచారు.

కాబట్టి ఇట్టి విషయమై గౌరవప్రదమైన మీడియా ద్వారా డిమాండ్ చేస్తూన్నాం అని, ఇట్టి విషయమై సీఐ ని కాపాడుతున్న ఏసీపీ పై కూడా క్షేత్రస్థాయి విచారణ జరిపించాలని, సీఐ తన అక్రమాలకు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కాకుండా సిట్ విచారణ జరిపించాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని మరియు ఉన్నత అధికారులను డిమాండ్ చేసారు. లేనియెడల ముఖ్యమంత్రికి ప్రజా పాలనలో ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా వివిధ ప్రజా సంఘాలు మరియు కుల సంఘాలతో న్యాయం కోసం చట్టానికి లోబడి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని మీడియా ముఖంగా ప్రకటన చేశారు.






