Monday, March 16, 2026

సమసమాజ నిర్మాణం కోసం గద్దరన్న పాటుపడ్డారు: కిచ్చెన్న

  • బీదత్వం లేని కుటుంబాలుగా మారాలని ఆకాంక్షించారు
  • తుక్కుగూడలో జరిగిన గద్దర్ జయంతి ఉత్సవాల్లో కేఎల్ఆర్

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్): ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమం చేసి… రాజ్యాధికారం సాధ్యమని భావించే గద్దరన్న కాంగ్రెస్ లో చేరారని కేఎల్ఆర్ అన్నారు. దివంగత నేత, గాయకుడు గద్దర్ జయంతి ఉత్సవం సందర్భంగా తుక్కుగూడ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ సాంస్కృతిక బృంద కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమసమాజం అభివృద్ధి చెంది బీదత్వం లేని కుటుంబాలుగా మారాలని లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. ఓటుహక్కుతో మార్పు సాధ్యమని ఆఖరి జీవితంలో కాంగ్రెస్ లో చేరారని కేఎల్ఆర్ తెలిపారు. గద్దరన్నకు ఆరోగ్యం బాగోలేక పోతే ఆపరేషన్ కోసం వెంటనే ఆస్పత్రిలో జాయిన్ కావాలని సూచించినట్లు కిచ్చెన్న గుర్తు చేసుకున్నారు. ఆయనస్ఫూర్తిని కొనసాగించాలని యువతకు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గద్దర్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించటం గొప్ప విషయమన్నారు. కేఎల్ఆర్. గద్దరన్న మన మధ్య లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News