Monday, March 16, 2026

చివరి మడి వరకు నిరందిస్తాం – మేడిపల్లి సత్యం

నేటి సాక్షి, కొడిమ్యాల, జనవరి 31: చొప్పదండి నియోజకవర్గంలో చివరి మడి వరకు సాగు నీరు అందిస్తాం అని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు శుక్రవారం కొడిమ్యాల మైసమ్మ చెరువు నుండి పోతారం రిజర్వాయర్ కు పంపులు ప్రారంభించారు, ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఏ ఓక్క ఎకరం కూడా నీళ్లు లేకుండా ఎండిపోవడం చొప్పదండి నియోజకవర్గంలో జరగదని నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తం కుమార్ రెడ్డి గారితో ప్రత్యేక సమీక్ష నిర్వహించి రైతులు నీళ్ల కోసం ఎదిరిచూడకముందే నీళ్లు అందిస్తున్నాం అని తెలిపారు గతంలో రైతులు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తే తప్పా సాగు నీరు రాలేదని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిలువెరీ నారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గడ్డం జీవన్ రెడ్డి, నాయకులు గుడి మల్లికార్జున్ రెడ్డి, పిడుగు ప్రభాకర్ రెడ్డి, ముత్యం శంకర్, చంద్రమోహన్ రెడ్డి, గాజుల అజయ్, గోల్కొండ రాజు, జలంధర్, లక్ష్మారెడ్డి, వడ్లకొండ హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News