
నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి): తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ కమిటీకి రాష్ట్ర అధ్యక్షులుగా బి గోవర్ధన్, ప్రధాన కార్యదర్శిగా సుతారి రాములు రెండవసారి ఏకగ్రీవంగా కార్యవర్గం ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర రెండవ మహాసభలు జనవరి 31న రెండు రోజులపాటు కోరుట్లలో జరిగినవి, రెండవ రోజు సి ప్రభాకర్ భవన్ లో ముందుగా ఏఐటీయూసీ సీనియర్ నాయకులు బీడీ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు ఎండి మౌలానా అరుణ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మహాసభలలో నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ తొలి రోజున బీడీ పరిశ్రమపై జిఎస్టి పన్నులను పెంచవద్దని, బీడీ కార్మికులకు కనీస పెన్షన్ 5000 రూపాయలు పెంచాలని, పిఎం ఆవాస్ యోజన పథకం ద్వారా అరులైన బీడీ కార్మికులకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, బీడీ కార్మిక సంక్షేమ నిధి ద్వారా అందిస్తున్న పథకాలు యధావిధిగా కొనసాగించాలని, నోట్ల రద్దు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తు కార్మికుల కూలీ డబ్బు బ్యాంకు ఖాతాలో కాకుండా బీడీ కంపెనీ నుండి కార్మికులకు నేరుగా చేతుకు అందించాలని, వీడిఏ పతి పాయింట్ కు గతంలో పది పైసల ఉండగా దానిని 20 పైసలకు పెంచాలని, నెలలో 26 రోజులు పని కల్పించాలని, అనేక సమస్యలపై ఈ మహాసభలలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని స్థలం ఉన్న పేదలకు 5 లక్షల ఆర్థిక సహాయం వెంటనే అమలు చేయాలని అలాగే బీడీ కార్మికుల కు కు ఖతాఫ్ డేటును తీసివేసి 2014 నుండి పిఎఫ్ పొందిన బీడీ కార్మికులు అందరికీ జీవన భృతి 2016 నుండి 4000 రూపాయలు పెంచుతామన్న గత అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే అమలు చేయాలని, లేనియెడల స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలలో ఓటు ద్వారా ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అనంతరం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా ఎండి మౌలానా రాష్ట్ర అధ్యక్షులుగా బి గోవర్ధన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సుతారి రాములు ఉపాధ్యక్షులుగా కొక్కుల శాంత కెవి అనసూయ కె గోదావరి సహాయ కార్యదర్శులుగా బత్తిని సదానందం, ఎస్ భానుచందర్, తీరునారి లక్ష్మణ్, కోశాధికారిగా ఎండి ముక్రం, కార్యవర్గ సభ్యులుగా కడారి రాములు, అజ్జ వేణు, తోట బిక్షపతి, వై ఓమయ్య, ఎండి కాసిం ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఈ మహాసభలకు ఆర్థికంగా సహాయం అందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.





