Monday, March 16, 2026

మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న

నేటి సాక్షి, కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల): జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గంగలో స్నానాలు చేస్తే పాపాలు, దరిద్రం పోతదా అని వక్రీకరిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ మాట్లాడిన మాటలను హిందుత్వ వాది కట్కూరి అశోక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అన్య మతస్తుల తీర్థయాత్రలకు సబ్సిడీలు ఇచ్చినట్టు హిందూ యాత్రలకు ఎలాంటి సబ్సిడీలు లేవు మా ఆచారాలు మరియు యాత్రల వల్ల ప్రభుత్వాలకు ఎక్కువ మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. అది తిరిగి మళ్లీ ప్రజలందరికీ ప్రభుత్వాలు ప్రజలకు ఖర్చు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహా కుంభమేళాకు 5500 కోట్లు ఖర్చు చేస్తే కుంభమేళా జరిగే కేవలం 45 రోజులలో 25 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నేరుగా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి మరియు 6 లక్షల మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఈ కుంభమేళా ద్వారా ఉపాధి దొరుకుతుంది. కుంభమేళా జరిగే ప్రయాగ రాజ్ ప్రాంతంలో ముందస్తుగా అక్కడ జరిగిన పనులకు గా ను 45 వేల కుటుంబాలకు పని దొరికి ఉపాధి లభించింది. ఈ విధంగా కొన్ని వేల కుటుంబాలకు ఉపాధి దొరకడం వల్ల పేదరికం కూడా తగ్గుతుంది. ఈ మాత్రం తెలవని మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఎలా అయ్యాడో హాస్యాసపదంగా ఉందన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులుగా కొనసాగే అర్హత కూడా మల్లికార్జున ఖర్గేకు లేదని దుయ్యబట్టారు. మల్లికార్జున ఖర్గే బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News