- ఐక్యతతోనే బీసీల హక్కుల సాధన సాధ్యం
- కుక్కల నాగరాజు ముదిరాజ్
- మెపా ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి
నేటిసాక్షి వాజేడు : ములుగు జిల్లా కేంద్రంలో మెపా (ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రోఫెషినల్స్ అసోసియేషన్) జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ముదిరాజ్ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల నాగరాజు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి అయన మాట్లాడుతూ తరతరాలుగా కొన్ని సామాజిక వర్గాల చేతిలోనే అధికార పాలన పగ్గాలు ఉండటం చేత వెనుకబడిన బీసీలంతా ఏకమయ్యే సమయం ఆసన్నమైంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం నాడు హనుమకొండ లోని కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం లో బీసీ రాజకీయ యుద్ధ భేరి నిర్వహించడం జరుగుతుంది. ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని బీసీ కులాల ప్రాతినిధ్యం నిర్వహించనున్న ఈ బీసీ మహా గర్జనకు మెపా ములుగు జిల్లా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని జిల్లా కమిటీ తెలిపింది. 78 ఏళ్ల స్వాతంత్ర భారత దేశంలో బీసీ ల స్థానం రోజు రోజుకు దిగజారి పోతుందని అభిప్రాయపడ్డారు. బీసీ లను ఓటర్లుగా ఓట్ల రాజకీయం కోసమే వాడి రాజ్యాధికారానికి దూరం చేసారని అన్నారు ఈ డబల్ ఎస్ క్రీమిలేయర్ పేరిట మన రిజర్వేషన్లను మనకు కాకుండా చేశారని తెలిపారు. మండల కమీషన్ సిఫారసుల్లో సూచించిన 52% బీసీ ల వాటా ఉద్యోగ, ఉపాధి, రాజకీయాల్లో లేకుండా పోయిందన్నారు. రాజ్యాధికారం’లో మన వాటా కోసం, పోరాడడానికి పోరుగల్లు మన ఓరుగల్లు గడ్డమీద రాజకీయ యుధ్ధ భేరి మోగిద్దామని పిలుపునిస్తూ ప్రతి బీసీ బిడ్డ ఫిబ్రవరి 2న జరిగే బీసీ రాజ్యాధికార సాధన’ లో పాల్గొనాలని ములుగు జిల్లా కమిటీ పిలుస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మాజీ ఉప సర్పంచ్ సాధు రాజు ముదిరాజ్ మెపా జిల్లా ఉపాధ్యక్షుడు భూమ నరేష్ ముదిరాజ్ వెంకటాపూర్ మండల అధ్యక్షుడు మేకల రమేష్ ముదిరాజ్, కుక్కల కౌశిక్ ముదిరాజ్, నర్ర భద్రయ్య, కాసర్ల కుమార్, చిగురు దేవేందర్, మేకల రవీందర్, బోగిరి మనోజ్, తదితరులు పాల్గొన్నారు.





