నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జిల్లాలో అతివేగంగా నాన్ గెజిటెడ్ ఉద్యోగుల టిఎన్జీవో సభ్యత్వాలను పూర్తిచేసిన సందర్భంగా సంఘం కేంద్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని టిఎన్జీవో కార్యాలయంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్ ఆధ్వర్యంలో టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ని టిఎన్జీవో శ్రేణులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లాలో 90 శాతం సంఘం సభ్యత్వాలు పూర్తి చేయడంతో పాటు జిల్లాలో ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదించి, సమస్యలు పరిష్కరించడంలో శ్రీహరి సేవలు అభినందనీయమని కొనియాడారు. అనంతరం జిల్లాలో 90 శాతం సభ్యత్వం చేయడంలో సహకరించిన మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ ను, తెలంగాణ పంచాయతీ కార్యదర్శి సెంట్రల్ ఫోరం సంయుక్త కార్యదర్శిగా నియమితులైన ఏ చంద్రమౌళి ని, అదేవిధంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగిగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు పొందిన టిఎన్జిఓ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి ని, మందమర్రి యూనిట్ కార్యదర్శి సతీష్ లను శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపు రావు, కోశాధికారి ఏ సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు కేజియా రాణి, శ్రీనివాస్, రామ్ కుమార్, అంజయ్య, నరేందర్, సంయుక్త కార్యదర్శి సునీత, పబ్లిసిటీ కార్యదర్శి యూసఫ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రావణ్, మంచిర్యాల యూనిట్ కార్యదర్శి అజయ్, మందమర్రి యూనిట్ అధ్యక్షుడు సుమన్, బెల్లంపల్లి అధ్యక్షుడు వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు మోసిన్, కుమార్, ప్రణవానంద్ లు పాల్గొన్నారు.





