- యువజన కాంగ్రెస్ గద్వాల తాలూకా జనరల్ సెక్రటరీ ధరూర్ రవి
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోరాటంలో తన ఆట పాటలతో ఉద్యమాన్ని ఉత్తేజపరిచిన విప్లవ కవి, ప్రజా యుద్ధనౌక గద్దర్ గారి జయంతి సందర్భంగా జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ క్యాంప్ కార్యాలయంలో గద్దర్ చిత్రపటాన్నికి గద్వాల తాలూకా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ధరూర్ రవి సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలమాలలు ఘన నివాళులర్పించారు. అనంతరం ధరూర్ రవి మాట్లాడుతూ… తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన సాహిత్యం ద్వారా యావత్తు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోనుపాడు శ్రీనివాస్ గౌడ్, అల్వాల రాజశేఖర్ రెడ్డి, పెదొడ్డి రామకృష్ణ, కేఎంఎస్ శ్రవణ్ కుమార్, ఆనంద్ గౌడ్, శెట్టి ఆత్మకూరు లక్ష్మణ్, ధోని ఆంజనేయులు, జమ్మిచేడు రాము, బిల్డర్ రామకృష్ణ, వడ్డే కృష్ణ తదితరులు ఉన్నారు.





