- కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీపీ
- స్థానిక ఎన్నికల నేపథ్యంతో కాంగ్రెస్

నేటి సాక్షి రామడుగు (పురాణం సంపత్): స్థానిక ఎన్నికల నేపథ్యంతో రామడుగు బిఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. మండల ఎంపీపీ దంపతులు కలిగేటి కవిత లక్ష్మణ్ శుక్రవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాజీ ఎంపీపీ దంపతులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంతో కాంగ్రెస్ రామడుగు మండలంలో ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ, రామడుగు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జవ్వాజి హరీష్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల- తిరుపతి, గోపాల్రావుపేట మాజీ ఎంపీటీసీ ఎడవల్లి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఉప్పుల ఆంజనేయ ప్రసాద్, మురళీకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.





