నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణం సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు బచ్చు వెంకటేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి నాగబంది యాదగిరి పూరి బాలరాజు బచ్చు రాము మాట్లాడుతూ వనపర్తి శ్యామలంగా ఎవరికి ప్రజలకు కష్టాలు రాకూడదని తెలపడం జరిగింది. మహిళా సంఘం యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు హోమాలు పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఆర్యవైశ్య మహిళా సంఘం వారు తామర గింజలతో 25 అమ్మవారు కలశంలో పెట్టడంతో ప్రత్యేక ఆకర్షణ చేశారు 102 గోత్రాలు 108 మంగళ హారతులతో ప్రత్యేక పూజలు ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ చేయించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం కోశాధికారి దాచ శివకుమార్, న్యాయవాది కో ట్ర రామకృష్ణ, పట్టణ ఉప అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు, వర్తక సంఘం సీనియర్ కమిటీ నాయకులు కలకొండ బాబు, యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్, జర్నలిస్ట్ మారం గోవిందు గుప్తా, కూన శివ , గుబ్బ ప్రణీత్, కూన చందు, ఈపూరి భరత్, కూన శ్రీకాంత్,మెడిశెట్టి బాలకృష్ణ, కున శివ, కళ్యాణ్, రమణ, నవీన్, కల్వ భుపేష్ కుమార్, మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి కలకొండ భాగ్యలక్ష్మి, అనంత ఉమామతి, గుబ్బ మాధవి,కొండూరు మంజుల ప్రవీణ్, కొంపల శ్రీలక్ష్మి ఆర్యవైశ్యమహిళలు ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





