Monday, March 16, 2026

పేదల పెన్నిధిగా ప్రజా సేవలో నిమగ్నమైన భూక్య జంపన్న

నేటిసాక్షి ప్రతినిధి, ములుగు, కొత్తగూడ : ములుగు జిల్లా బిఅర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు భూక్య జంపన్న ఆధ్వర్యంలో గత బుధవారం రోజున మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో జరిగిన ఉచిత కంటి శిబిరం బిపి షుగర్ కంటి వైద్య శిబిరానికి దాదాపు 370 మంది పైగా ఓ పి చూపించుకోగా 74 మంది కంటి సమస్యతో బాధపడుతున్నారని డాక్టర్లు గుర్తించగా వారిని బుధవారం రోజున హైదరాబాద్ లో శంకర ఆసుపత్రికి తరలించగా వారికి గురువారం రోజున ఉచితముగా కంటి ఆపరేషన్ విజయవంతంగా చేయడం జరిగింది. వారిని శుక్రవారం రోజు న హైదరాబాదు నుండి క్షేమముగా ములుగు నియోజకవర్గ కొత్తగూడ మండలం యందు సురక్షితంగా చేర్చడం జరిగింది. వారితో పాటు బిఆర్ఎస్ ములుగు నియోజకవర్గ జిల్లా నాయకులు భూక్య జంపన్న బస్సు ప్రయాణము చేసి వారి ఆపరేషన్ గురించి మాట్లాడుతూ వారి యోగక్షేమాలు తెలుసుకొని ఉచిత కంటి ఆపరేషన్ తరువాత వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆపరేషన్ చేయించుకున్న వారికి వివరిస్తూ కొత్తగూడ మండలంలో సురక్షితంగా వారి వారి ఇంటికి చేర్చడం జరిగిందని భూక్యా జంపన్న తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News