నేటి సాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్): చందుర్తి మండలంలోని ఆశిరెడ్డిపల్లి అనుబంధ గ్రామమైన గొల్లపల్లి లో శుక్రవారం రోజున శ్రీకృష్ణ యాదవ సంఘం పాలకవర్గం ఆధ్వర్యంలో నూతనంగా నెలకొల్పిన యాదవుల కులదైవమైన శ్రీ చౌడలమ్మ తల్లి, పోతలింగన్న విగ్రహ ప్రతిష్ట మరియు హోమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలందరూ పాల్గొని వేద పండితులచే అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం బొజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బొజ్జ గంగయ్య,బొజ్జ మల్లేశం,బొజ్జ రాములు,బొజ్జ రాజయ్య,బొజ్జ చిన్న రాములు,బొజ్జ అనిల్,బోల్లు గంగరాజు, బొజ్జదేవరాజు, బొంగు తిరుపతి,గంగరాములు, గణేష్, శేఖర్, సీను, వంశీ గణేష్, రాజు మల్లన్న యూత్ సభ్యులు, శ్రీ కృష్ణ యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





