నేటి సాక్షి, చందుర్తి ప్రతినిధి (సతీష్): చందుర్తి మండల కేంద్రంలోని పోచమ్మ గుడికి సమీపంలో శివాలయం నిర్మాణానికి చందుర్తి గ్రామానికి చెందిన ప్రముఖ ఎన్నారై మోతే బాబు తన సొంత స్థలాన్ని గుడి నిర్మాణానికి విరాళంగా అందజేశారు. మరో ప్రముఖ ఎన్నారై క్రీ.శే. మోతే ఓదేలు మనమడు బజ్జ కిషోర్ విగ్రహ దాతగా ముందుకు వచ్చారు. మరో ఎన్నారై ఆవిరినేని శ్రీనివాసరావు ఆలయ నిర్మాణానికి ఒక లక్ష 50 వేలు, లింగంపల్లి బాబు 300 సిమెంటు బస్తాలను అందజేయనున్నారు.





