నేటి సాక్షి, వీణవంక : వీణవంక మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది, అధికారులు సమయపాలన పాటించడం లేదు. శుక్రవారం ఉదయం 10:40 గంటలు అవుతున్న అధికారులు, కార్యాలయం సిబ్బంది ఎవరు కూడా విధులకు హాజరు కాకపోవడం శోచనీయం. మండల ప్రజలు వివిధ పనుల నిమిత్తం గంటలకొద్దీ వేచి చూస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు అధికారుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదంటూ స్థానిక ప్రజలు అధికారులపై ఆగ్రహం చెందుతున్నారు. సమయపాలన పాటించని అధికారులపై, కార్యాలయం సిబ్బందిపై ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.





