Monday, March 16, 2026

బండి సంజయ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని గద్దర్ కి క్షమాపణ చెప్పాలి

  • మాల మహానాడు జిల్లా కన్వీనర్ నీరటి శ్రీనివాస్..
  • ఘనంగా విప్లవ వీరుడు ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతి వేడుకలు..

నేటి సాక్షి ప్రతినిధి, చందుర్తి (సతీష్): చందుర్తి మండల కేంద్రంలో తెలంగాణ మాలమహానాడు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సాంస్కృతిక విప్లవకారుడు ప్రజాయిద్ధ నౌక తెలంగాణ ఉద్యమంలో తన కాలుకు గజ్జె కట్టి ఆటపాటలతో ప్రజలను చైతన్యపరిచి కీలకపాత్ర పోసించిన గద్దర్ 76 వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. అంతటి గొప్ప వ్యక్తిని కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి బండి సంజయ్ పద్మశ్రీ ఎలా ఇస్తామని అహంకార పూరిత మాటలు మాట్లాడడం సరికాదని మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకొని గద్దర్ కు క్షమాపణ చెప్పాలని మాల మహానాడు చందుర్తి మండల పక్షాన డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా కన్వీనర్ నీరటి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల కమలాకర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్, కాంగ్రెస్ నాయకులు గొట్టే ప్రభాకర్, నీరటి ప్రసాద్, పులి సత్యం, లింగంపల్లి అజేయ్ కుమార్, మాలమహానాడు నాయకులు రాగుల ప్రభాకర్, రాగుల సుబ్రహ్మణ్యం, బత్తుల అశోక్, బత్తుల వరయ్య, పాటి జ్యోతి కుమార్, రాగుల దాసు, బత్తుల పద్మారావు వివిధ గ్రామాల సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News