నేటిసాక్షి ప్రతినిధి, డా. శివ శంకర్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్ : తిరుపతి జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ను టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి. దివాకర్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా మంత్రి శ్రీకాళహస్తి నియోజకవర్గం పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ తో కలసి డాలర్స్ దివాకర్ రెడ్డి మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి తో కలిసి సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలు, పార్టీ అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమం, తో పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తో దివాకర్ రెడ్డి భేటీ అయ్యారు.





