- మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీ బి.యస్.కేశవ్
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : శనివారం శ్రీ భక్త మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా పద్మశాలి సంఘం కన్వీనర్ టి.ఆర్.పి.ఎస్ కోట నరసింహులు ఆధ్వర్యంలో రాఘవేంద్ర కాలనీ అంధ్రుల ఆశ్రమ పాఠశాలలో మార్కండేయ స్వామి చిత్రపటానికి శివ స్వాములతో పూజా కార్యక్రమం చేసి అంధ విద్యార్థులకు అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గద్వాల మున్సిపల్ మాజీ చైర్మన్ బిఎస్ కేశవ్ గారు టీ ఆర్ పి ఎస్ చేనేత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏరువ ఊశన్న గారు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు… దైవకార్యంతో పాటు అంధ విద్యార్థులకు అల్పాహార విందు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని సామాజిక బాధ్యతతో ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయడం చాలా సంతోషకరమని ఇది మంచి ఆలోచన అని వారు పేర్కొన్నారు అనంతరం టిఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర చేనేత విభాగం ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఏరువా భూషణ్ ని మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ అన్నగారు చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మాకం బాలరాజు చిన్ని నాగరాజు మేడం రామకృష్ణ పోతు భీమేష్ ఏర్వ రామన్న బుదార్పు నాగరాజు, పోతు కృష్ణ, ఏరువా రఘు, ఏరువా రాజశేఖర్, భోగం కృష్ణ, బావుండ్ల శ్రీహరి, కడదాస్ నర్సింహులు, బిజ్జ కృష్ణ, కోట లక్ష్మణ్, గంజి వెంకటేష్, నీలి శివ రాములు, జంద్రం నాగరాజు, మేడం రమేష్, శివ స్వాములు, గోరంట్ల రవి, మేడమ్ ఆనందు, పగడాకుల శంకర్, పలువురు తిప్పన్న వెంకటేష్, శివ, తదితరులు పాల్గొన్నారు.





