Monday, March 16, 2026

పదో తరగతి బోర్డు పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేల చర్యలు తీసుకోవాలి

  • తెలంగాణ మోడల్ స్కూల్ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు
  • పెండింగ్ లో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పంచాయతీరాజ్ అధికారులతో కలిసి పరిశీలించారు
  • ఉగాది పండగ లోపు ఇండ్లను నిర్మాణం పూర్తి చేయాలి
  • జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా ఫిబ్రవరి 01 : శనివారం ఖిల్లా గణపురం మండల పరిధిలోని డీకే తండా శివారులోని తెలంగాణ మోడల్ స్కూల్ ను, ఘనపురం మండల కేంద్రంలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రెండు పాఠశాలల్లో అధ్యాపకులతో కలెక్టర్ వేరువేరుగా సమావేశాలు నిర్వహించారు. మార్చి 21 నుండి పదో తరగతి బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సిలబస్ పూర్తయిందా లేదా? విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు, అనే విషయంపై సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. రివిజన్ టెస్టుల్లో విద్యార్థులకు ఏ విధమైన మార్కులు వస్తున్నాయి అనే వివరాలను తెప్పించుకొని పరిశీలించారు.కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే పదవ తరగతి బోర్డు పరీక్షల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యార్థులు ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారు గుర్తించాలని, అందుకు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి వారిని పరీక్షలకు సన్నద్ధం చేయాలని సూచించారు. వెనుకబడిన విషయాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రాథమిక అంశాల నుంచి వారికి బోధించాలని చెప్పారు. ముఖ్యంగా గణితం, సైన్స్, హిందీ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బోర్డు పరీక్షల్లో ఏ ఒక్క విద్యార్థి ఫెయిల్ అయ్యేందుకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, అందులో భాగంగా వారికి ఉదయాన్నే అల్పాహారం అందించాలని సూచించారు.విద్యార్థులతో మాట్లాడుతూ ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకొని మంచి మార్కులు సాధించడానికి ప్రయత్నించాలన్నారు. పరీక్షలు రాయడానికి ఇప్పుడున్న గడువు చాలా కీలకమని, దీన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. ఇప్పుడు పదో తరగతి చదువుతున్న విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకొని జూనియర్లకు ఆదర్శంగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మోడల్ పాఠశాలలోని మధ్యాహ్నం భోజనాన్ని తనిఖీ చేయగా, దొడ్డు బియ్యం వండడం పట్ల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన సన్న బియ్యం మాత్రమే వడ్డించాలని ఆదేశించారు. దొడ్డు బియ్యం స్టాక్ ను వెనక్కి పంపించాలని, నాణ్యమైన బియ్యం మాత్రమే దించుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా, మోడల్ స్కూల్ వసతిగృహాన్ని సందర్శించిన కలెక్టర్ స్టాక్ రిజిస్టర్ లను తనిఖీ చేశారు. భోజనం వండిన తర్వాత విద్యార్థులకు వడ్డించే ముందు సూపర్వైజర్లు రుచి చూసి, బాగుంటేనే విద్యార్థులకు వడ్డించాలని చెప్పారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఖిల్లా గణపురం మండలం పరిధిలోని మామిడి గ్రామంలో పెండింగ్ లో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పంచాయతీరాజ్ అధికారులతో కలిసి పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మాణం పూర్తి కావలసిన చర్యలను వెంటనే చేపట్టాలన్నారు. ఉగాది పండగ లోపు ఇండ్లను నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని మండల తహసీల్దార్ కు సూచించారు.పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజనీర్ మల్లయ్య, సింగిల్ విండో డైరెక్టర్ సాయి చరణ్ రెడ్డి, తహసిల్దార్ సుగుణ, ఎంపీడీవో వెంకటాచారి, ఎంఈఓ, పాఠశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News