Monday, March 16, 2026

సైబర్ నేరస్థుల వలలో యువకుడి బలి

  • టెలిగ్రామ్ యాప్ ద్వారా డబ్బుల డిపాజిట్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన పంగిడిపల్లె యువకుడు

నేటి సాక్షి,కమలాపూర్, (నాగరాజు పటేల్ ఎడ్ల): హనుమకొండ జిల్లా, కమలాపూర్ మండలంలోని, పంగిడిపల్లి గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్ అనే యువకుడు సైబర్ నేరస్తుల వలలో పడి సుమారు రెండు లక్షల 50 వేల రూపాయలు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే అన్నారపు పవన్ కళ్యాణ్, తండ్రి సాయిలు కులం : తెనుగు వయస్సు : 21 సంవత్సరాలు గ్రామం పంగిడిపల్లి అను యువకుడు బిటెక్ ఫైనల్ ఇయర్ చదువు తున్నాడు. ఇతనికి 18.01.2025 నాడు టెలిగ్రామ్ యాప్ ద్వారా కాంటెంట్ స్క్వేర్ అనే అడ్రస్ నుంచి ఒక మెసేజ్ వచ్చిన తరువాత అందులో వారు 78,530 రూపాయలు డిపాజిట్ చేస్తే 3 లక్షలు వస్తాయని చెప్పడంతో ఒకసారి ఆ డబ్బులను పంపించినాడు. ఆ తరువాత రెండోసారి 1,70,743/- రూపాయలు పంపించి మొత్తంగా పవన్ కళ్యాణ్ 2,49,273/- రూపాయలు సైబర్ నేరస్తుల మాట విని మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఈ. హరికృష్ణ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News