నేటి సాక్షి,వేమనపల్లి : ఎన్నో ఏండ్లుగా కలగా ఉన్నటువంటి వేమనపల్లి మండలానికి జూనియర్ కాలేజ్ మంజూరు చేయడానికి కృషి చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు మాజీ జడ్పీటిసి ఆర్. సంతోష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ సాబీర్ అలీ కలిసి ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కాలేజ్ వలన దూర ప్రాంతాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఇబ్బంది తప్పిందని కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేమనపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.





