Monday, March 16, 2026

ఆపరేషన్ స్మైల్ విజయవంతం

  • కమిషనరేట్ పరిధిలో 88 మంది బాలలకు విముక్తి
  • రామగుండం పోలీస్ కమీషనరేట్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- రామగుండం పోలీస్ కమీషనరేట్ వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్-XI కార్యక్రమం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులు, సిబ్బంది, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, వివిధ శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ విజయవంతంగా ముగిసిందని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్, ఐజి శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహించి, తప్పిపోయిన, వదిలివేయబడిన, వివిధ రకాల బాల కార్మికులు కిరాణం షాప్ లలో, మెకానిక్ షాపులలో, హోటళ్లలో, వివిధ కంపెనీ లలో పనిచేస్తూ, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలు బాలకార్మికులుగా ఉన్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి, వారికి అప్పగించడం, లేదా స్టేట్ హోమ్ కు పంపించడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగా కమీషనరేట్ పరిధిలో ప్రతి డివిజన్ పరిధిలో ఒక ఎస్ఐ, నలుగురు సిబ్బందిని నియమించి, టీం లు ఏర్పాటు చేసి, ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థలను గుర్తించి, విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. జనవరి 1, 2025 నుండి జనవరి 31 వరకు ఆపరేషన్ స్మైల్-11 కార్యక్రమాన్ని కమీషనరేట్ వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించడం జరిగిందనీ, దానిలో కమీషనరేట్ పరిదిలో 88 మంది బాల బాలికలను గుర్తించడమైనదని తెలిపారు. పెద్దపల్లి జిల్లా పరిదిలో బాలురు-11, బాలికలు – 03 మొత్తం – 14 మంది, 02 కేసులు నమోదు చేసి, 04 బాల కార్మికులను విముక్తి చేసి, పాఠశాలలో చేర్పించడం జరిగిందన్నారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లా పరిదిలో బాలురు-55, బాలికలు – 19 మొత్తం -74 మంది, 01 కేసు నమోదు చేసి, 02 బాలకార్మికులని విముక్తి చేసి పాఠశాలలో చేర్పించడం జరిగిందని తెలిపారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నదని, బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. బాలల హక్కులను, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాలను నిరంతరం నిర్వహించడం జరుగుతుందని, అలాగే ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్న, ఎక్కడైనా పనిచేసిన, తప్పిపోయిన వదిలివేయబడిన బాలల సమాచారం తెలిసిన వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 (చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్) వారికి, డైల్ 100 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వగలరని సూచించారు. బాలకార్మికులుగా పెట్టుకున్న వారిపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ శాఖతో కలిసి ఆపరేషన్ స్మైల్ విజయవంతం చేయడంలో కృషి చేసిన వివిధ శాఖల అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News