- పిడిఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి శ్రీకాంత్ డిమాండ్
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి :-
పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యారంగానికి కేవలం1.28 లక్షల కోట్లు కేటాయించడం విద్యపై కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవాలని, విద్య రంగానికి 30శాతం నిధులు కేటాయించాలని ప్రగశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి శ్రీకాంత్ శనివారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ బడ్జెట్ వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు విద్యను దూరం చేసే పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే పరిస్థితి ఉందని, కార్పొరేట్లకు వత్తాసు పలికే బడ్జెట్ కేటాయించారని ఆరోపించారు. విద్యార్థులు చదువుకోవడానికి కొనుక్కోవలసిన పెన్ను, పెన్సిల్ లపై సైతం జీఎస్టీ వేయడం చాలా దుర్మార్గమని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం మరోసారి పునర్ సమీక్షించి విద్య రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్య రంగానికి కేటాయించిన బడ్జెట్ తెలంగాణ ఎంపీలు బడ్జెట్ పై విద్య రంగానికి 30 శాతం నిధులు కేటాయించేలా గొంతు విప్పాలని విజ్ఞప్తి చేశారు. లేనియెడల దేశ, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు.

