Monday, March 16, 2026

ఘనంగా భక్త మార్కండేయ జయంతి వేడుకలు

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జిల్లా కేంద్రంలోని మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీ నగర్ కాలనీలో శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవ సంఘం ఆధ్వర్యంలో శనివారం పద్మశాలీ ల ఆరాధ్య దైవం, ఋషి భక్త మార్కండేయ, మహా ఋషి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా భక్త మార్కండేయ చిత్ర పట్టణానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ, శ్రీ భక్త మార్కండేయ ఆశీస్సులతో పద్మశాలీలు యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా పద్మశాలీలు ఏకమై రాజ్యాధికారంలో భాగస్వామ్యం కొరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం తెలంగాణ ఉద్యమకారుడు, జిల్లా బీసీ జేఏసీ నాయకుడు, భక్త మార్కండేయ స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, పద్మశాలి సంఘం నాయకులు, బీసీ జేఏసీ జిల్లా నాయకుడు వడ్డేపల్లి మనోహర్, ఉపాధ్యక్షులు బూర్ల జ్ఞాని, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆడిచర్ల రాజేశం, జాయింట్ కార్యదర్శి అంకం చంద్రయ్య, నాయకులు శేఖర్, బూర్ల దామోదర్, మామిడాల సత్యనారాయణ, వి నరసింగరావు, బిసి సంఘాల నాయకులు గోపతి లక్ష్మణ్, బిల్ల రాజయ్య లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News