Tuesday, March 17, 2026

ప్రభుత్వానికి తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు

నేటి సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణ రాష్టంలో ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ గురుకులాల్లో 5, 6, 7, 8, 9 తరగతుల ప్రవేశం శనివారంతో ముగియగా టి జి పి ఏ రాష్ట్ర కమిటి అభ్యర్తన మేరకు ప్రభుత్వం మరొక 5 రోజులు పోడిగించడం జరిగినది. ఇందుకు గాను బడుగు బలహీన వర్గాల పిల్లలకు మరింత అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి మరియు గురుకులాల కార్యదర్శులకు తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో టి జి పి ఏ రాష్ట్ర అధ్యక్షులు ఆంబాల ప్రభాకర్ (ప్రభు), ప్రధాన కార్యదర్శి గుడిసె పవన్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర నిజ నిర్ధారణ కమిటి కన్వీనర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జీ దార మధు, జిల్లా ఇంచార్జీ సిలుముల సంజీవ్, జిల్లా నాయకులు సుంచు మల్లేశం, కాల్వకుమార్, మెరుగు తిరుపతి, గుండేటి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News