Tuesday, March 17, 2026

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఆన్యాయం

నేటిసాక్షిబ్యూరో, నిజామాబాద్, టి.ఎన్ రమేష్ : కామారెడ్డి జిల్లా, డీసీసీ అధ్యక్షుడు, కైలాస్ శ్రీనివాస్ రావు పార్లమెంట్, బడ్జెట్ పై స్పందిస్తూ తెలుగు మహిళ అయిన నిర్మలా సీత రామన్, కేంద్రంలో బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాల కి చెందిన నిర్మలమ్మ తెలంగాణ కు అన్యాయం చేశారు అనిఅన్నారు. ఇది పార్లమెంట్ బడ్జెట్ ల కాకుండా బీహార్ ఎన్నికల బడ్జెట్ లాగా ఉంది అని అయన దుయ్యబట్టారు. ఎన్నికల కోసమే బీజేపీ వాళ్లు బీహార్ కు నజరణాలు ఇచ్చారన్నారు. బీజేపీ తెలంగాణ పై వివక్ష చూపిస్తుంది అంటూ తన ఆవేదన వెళ్ళబుచ్చారు. రాజకీయంగా తెలంగాణను దెబ్బతీయలని బీజేపీ పార్టీ చూస్తుందని సినన్న ఫైర్‌ అయ్యారు. 50.65 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్రం తెలంగాణ ఒక్క పైసా ప్రత్యేక కేటాయింపు జరపలేదు. అంటుకేంద్రాన్ని అయన నిలదిసారు. త్వరలో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో అక్కడ రాజకీయ లబ్ది కోసమే బీజేపీ కేంద్ర బడ్జెట్ ను ఉపయోగించుకుంటుందని అన్నారు. దేశం మొత్తం ప్రజల నుండి వసూలు చేసిన పన్నులను, అన్ని రాష్ట్రాలకు సమానంగా పంచాలి. కానీ ఈ బడ్జెట్లో కీలక రంగాలకు కేటాయింపులు తక్కువ చేశారు, అంటు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజలను చాలా నిరాశపరిచింది అని అన్నారు. గత బడ్జెట్లో పెట్టిన అంశాలను పూర్తిగా అమలు చేయలేదుపైగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. 8 మంది ఎంపీలను గెలిపించిన తెలంగాణ ప్రజలకు పంగనామాలు పెట్టి బీజేపీ తన స్వార్థం ఉందన్నారు. ఇది ముమ్మాటికి బిజెపి పాలిత రాష్ట్రాల కేటాయింపులతో కూడిన బడ్జెట్, అంటుమండిపడ్డారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News