Monday, March 16, 2026

న్యాయవాది వృత్తి చాలా పవిత్రమైనదనీ, న్యాయవాదులు నిజాయితీ వైపు నిలవాలి

  • జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా ఫిబ్రవరి 01 : న్యాయవాది వృత్తి చాలా పవిత్రమైనదనీ,న్యాయవాదులు అధర్మం వైపు కాకుండా ధర్మం వైపు నడవాలని, నేరస్తులకు అండగా నిలవకుండా నిజాయితీ వైపు నిలవాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపిఎస్ అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్.డి.ఎం లా, కళాశాలలో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. అడ్వకేట్ వృత్తి చాలా పవిత్రమైనదనీ సమాజంలో తమ వృత్తిపై జనంలో నమ్మకం పెరగాలంటే అధర్మం వైపు కాకుండా ధర్మానికి ప్రతీకగా నిలవాలని ఆయన సూచించారు. ఏదేని తప్పు జరిగినపుడు బాధితులు కోర్టును శ్రయిస్తారని,పూర్వాపరాలు విన్న న్యాయవాది నిజాయితీ కోసం పాటు.పడుతూ తప్పును తప్పుగా చెప్పాలని ఆయన వివరించారు. ముఖ్యంగా మహిళల భద్రత గూర్చి ఎస్పీ ప్రస్తావిస్తూ మహిళలు రక్షణకు షీటీం ప్రత్యేకంగా పనిచేస్తుందన్నారు. విద్యార్థినులను వేధింపులకు గురిచేసిన, ర్యాగింగ్ చేసిన కఠిన చర్యలు ఉంటాయని స్కూల్లో, కళాశాలలో, బస్టాప్ ఇతర నిర్మాణ ప్రాంతాలు ఎవరైనా అమ్మాయిలను వేధిస్తే షీ టీం పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 6303923211 కు లేదా డయాల్ 100 కు కాల్ చేయాలన్నారు. సమచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయాని తెలిపారు.అదేవిదంగా వేధింపుల రకాలు, షి టీం ను అప్రోచ్ అయ్యే విధానం ను, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియజేశారు.విద్యా ఆవశ్యకత గురించి తెలియజేసి బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాల గురించి, పొక్సో కేసుల నమోదు, శిక్షల గురించి వివరించారు.అనంతరం మొదటి సంవత్సరం,రెండో సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మెమొంటోలు అందజేశారు. కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ విలువైన సమయాన్ని కేటాయించి విద్యార్థులలో నూతన ఉత్తేజం కల్పించిన ఎస్పీ కి కళాశాల యజమాన్యం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వనపర్తి సీఐ, కృష్ణ, షీ టీం ఎస్సై, అంజద్, షీ టీం పోలీస్ సిబ్బంది శ్రీనివాసులు, కృష్ణ శ్రీను,రమేష్, కళాశాల ప్రిన్సిపాల్, భాస్కర్, కళాశాల ప్రొఫెసర్లు, వెంకటసాయి ప్రసాద, విజయకుమార్, దర్గా స్వామి, కరుణాకర్, నర్మద, వినోద్ రావు, నిఖిల్ సాగర్, పోలీస్ సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News