నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ ) : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడలో ప్రతి ఏటా శివ స్వాముల కోసం నిర్వహించే శివదీక్ష సేవా సమితి నిత్యాన్నదాన ట్రస్టుకు వేములవాడ పట్టణానికి చెందిన విశాల్ కుమార్ వారి కుటుంబ సభ్యుల తరపున శాశ్వత అన్నదానానికై 11,116 రూపాయల విరాళాన్ని శనివారం రోజున ట్రస్టు సభ్యులకు అందజేశారు. స్వామివారి దీక్ష స్వీకరించిన స్వాములకు శివదీక్ష సేవా సమితి దాతల సహకారంతో ఏర్పాటుచేసి అన్నదానానికి విరాళం అందజేయడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు వారు తెలిపారు. 41 రోజులు ఎంతో నిష్ట నియమాలు కష్టనష్టాలకోర్చి ట్రస్టు సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని, స్వామివారి ఆశీస్సులు అందరిపై ఎల్లవేళలా ఉండి మరింత మంది దాతలు అలాగే స్వామివారి సహకారంతో ట్రస్టు నిరంతరం స్వాముల సేవలో ఉండాలని సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శివ దీక్షా సేవా సమితి ట్రస్ట్ అధ్యక్షులు మచ్చ కిషన్ గురు స్వామి, అధ్యక్షులు చేపూరి రవీందర్ గురు స్వామి, ప్రధాన కార్యదర్శి సామ వీర రమణయ్య గురు స్వామి, ట్రస్ట్ కోశాధికారి రాపెళ్లి శ్రీధర్ గురు స్వామి , ఉప్పుల శ్రీనివాస్ గురుస్వామి, కోడం గణేష్ గురు స్వామి, సత్రం ఇన్చార్జ్ గుంటి కనకయ్య గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.





