- మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్
నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ (కోక్కుల వంశీ) : మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1380 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున లక్ష్మీగణపతి, రాజన్న మరియు భీమేశ్వర ఆలయాల వద్ద పేదలకు, అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలిపారు. శనివారం అన్నదాతలుగా వెంకట రావుపల్లి వాస్తవ్యులు నక్క శ్రీకాంత్ శిరీష దంపతులు, జువ్వాడి స్నేహాలత వెంకటేశ్వరరావు దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు, గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత, కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్ చంద్ర దంపతులు, శిరీష సాయిచంద్ర దంపతులు, శర్వాణి రవిచంద్ర దంపతులు, హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయికృష్ణ ఉన్నారని పేదలఅన్నదాన కార్యక్రమానికి సహకారం అందించాలనుకునే దాతలు ట్రస్టు సభ్యులను గాని ట్రస్టు ఫోన్ నం: 92469 39388 ద్వారా సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, నాగుల చంద్రశేఖర్, పొలాస రాజేందర్, జింక శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.





