Monday, March 16, 2026

సర్కారు దవాఖాన్లో ప్రసవాలయ్యేలా చూడాలి

  • వైద్య సేవలపై గర్భిణులతో చరవాణిలో సంభాషించిన కలెక్టర్
  • కోనరావుపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ
  • ప్రతి విద్యార్థి పై ప్రత్యేక దృష్టి సారించాలి
  • తహసీల్దార్ కార్యాలయంలో పలు రికార్డులను తనిఖీ
  • జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల ( కోక్కుల వంశీ ) : జిల్లాలోని గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు అయ్యేలా అవగాహన కల్పించాలని వైద్యాధికారులు, సిబ్బందిని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. శనివారం కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆసుపత్రి ఆవరణ, ఇన్ పేషెంట్ వార్డ్, ల్యాబ్, ఫార్మసీ పరిశీలించారు. ఓపి, అలాగే రక్త పరీక్షలపై ఆరా తీశారు. అనంతరం పీహెచ్సీ పరిధిలో వైద్య సేవలు పొందుతున్న గర్భిణులతో కలెక్టర్ నేరుగా ఫోన్లో మాట్లాడారు. ఇక్కడ అందుతున్న సేవలు, మందులువారి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. ఫార్మసీ నీ పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.దాదాపు అనంతరం వైద్యులు, ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడుతూ మండలంలోని గర్భిణులకు ప్రభుత్వ దావకానాల్లో అందిస్తున్న సేవలు, మందులపై అవగాహన కల్పించాలని వారు ఈ సేవలను వినియోగించుకునేలా చూడాలని ఆదేశించారు. గర్భిణులు, బాలింతలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిరంతరం వారి ఆరోగ్య వివరాలను సేకరించాలని వారికి కావాల్సిన మందులు అన్ని అందుబాటులో ఉంచాలని వైద్యులకు సూచించారు.

  • 10 జీపీఏ వచ్చేలా తీర్చిదిద్దాలి-

రానున్న పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు 10 జీపీఏ అన్ని సబ్జెక్టుల్లో వచ్చేలా తీర్చిదిద్దాలని ఆయా సబ్జెక్టు టీచర్లకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. కొనరావుపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని(కేజీబీవీ) కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు తరగతి గదులు, స్టోర్ రూమ్ ఆహారం వన్డే గదిని పరిశీలించారు. కూరగాయలు, సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు మ్యాథ్స్ సైన్సు పాఠ్యాంశాలు బోధించారు. వారి అనుమానాలను నివృత్తి చేశారు. అలాగే విద్యార్థులకు వైద్య సిబ్బందితో పరీక్షలు చేయించాలని, వారికి కావాల్సిన మందులను అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. రానున్న పబ్లిక్ పరీక్షల దృష్ట్యా అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులు విద్యార్థులు 10 జీపీఏ సాధించేలా ప్రణాళిక ప్రకారం చదివించాలని ప్రాక్టీస్ టెస్టులు రాయించాలని సూచించారు. ప్రతి విద్యార్థి పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అలాగే ఇంటర్ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. తరగతి గదులు సైన్స్ ల్యాబ్ లు, టాయిలెట్స్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

  • కార్యాలయాలు తనిఖీ-

అనంతరం కలెక్టర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో, తహసిల్దార్ కార్యాలయాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. తహసీల్దార్ కార్యాలయంలో పలు రికార్డులను తనిఖీ చేశారు. మండల స్థాయి అధికారులు విధుల్లో భాగంగా క్షేత్రస్థాయిలోకి వెళితే కార్యాలయంలో ఉన్న సిబ్బందికి సమాచారం ఇచ్చి వెళ్లాలని సూచించారు. ఎలాంటి సమాచారం లేకుండా విధులకు హాజరు కావద్దని స్పష్టం చేశారు. ఇక్కడ పి హెచ్ సి డాక్టర్ వేణుమాధవ్, కేజీబీవీ ఎస్ఓ ఇందిరా, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కేదారీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News