
నేటి సాక్షి, మెట్ పల్లి : డ్రగ్స్, మాదక ద్రవ్యాలపై యువత దూరంగా ఉండాలని జగిత్యాల జిల్లా, మెట్ పల్లి కోర్టు సీనియర్ సివిల్ జడ్జ్ నాగేశ్వర్ రావు అన్నారు. మెట్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని,విద్యార్తులకు జాతీయ న్యాయ సేవ సాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు శనివారం నిర్వహించారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల వాడటం వల్ల కలిగే దుష్పరినామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జడ్జ్ మాట్లాడుతూ.. డ్రగ్స్ ప్రపంచ దేశాలను పెను ముప్పుగా మారిందని, విద్యార్తులు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుందని, అందువల్ల యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని చెప్పారు.మైనర్ బాల, బాలికలు వాహనాలు నడపవద్దని వాహనాలు నడిపితే తల్లిదండ్రులకు శిక్షలు పడుతాయని అన్నారు. అలాగే సోషల్ మీడియాలో గేమ్స్ దూరంగా ఉండాలని, దాని వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలియజేసారు. ఎవరైనా డ్రగ్స్ వాడుతునట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని తెలిపారు. డ్రగ్స్ తీసుకునే వారిని డ్రగ్స్ తీసుకోవడంవల్ల కలిగే దుష్పరిణామాలను వివరించి మంచి మార్గంలో నడిచే విధంగా అవగాహన కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ పోలీస్ మెడల్ పొందిన పట్టణ సీఐ నిరంజన్ రెడ్డి ని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి,సెక్రెటరీ వేణుగోపాల్, ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, న్యాయవాదులు వెంకట నర్సయ్య, వెంకటస్వామి, ఓజ్జెల శ్రీనివాస్, ఆకుల ప్రవీణ్,వంగ వేణు,శంకర్ రెడ్డి,శేఖర్, ఆకుల మానస, శ్రీలేఖ, నర్సయ్య, రాజేందర్, సుధాకర్, ఎస్సై కిరణ్ తదితరులు పాల్గొన్నారు.





