
నేటి సాక్షి,మెట్ పల్లి : పట్టణంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో మండల వ్యవసాయ అధికారి దీపిక శనివారం దాడులు నిర్వహించారు.ఈ సందర్భంగా రుద్రేశ్వర ఫర్టిలైజర్ దుకాణంలో స్ట్రాంగ్ రిజిస్టర్లు అప్డేట్ చేయలేదని ఈపాస్ యంత్రంలోని బ్యాలెన్స్,ఒరిజినల్ స్టాక్ నిల్వలో తేడా ఉందని,అలాగే మహేశ్వర ఫర్టిలైజర్ దుకాణంలో ఒకే రైతుకు అధిక మొత్తంలో యూరియా విక్రయించారని గుర్తించినట్లు ఏవో తెలిపారు.రెండు దుకాణాల్లో విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. నిబంధనలో అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.





